Connect with us

Andhra

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న నీట్ లికేజి మాఫియాపై కఠిన చర్యలు చేపట్టాలి..MPJ

Published

on

కేంద్రంలోని బిజేపి డబుల్ సర్కారు అయిన రాజస్థాన్ లోని కోటాలో నీట్ పరిక్ష పేపర్ లుకేజి జరగడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు.

నీట్ పరీక్షల నిర్వహణలో NTA ద్వంద్వ ప్రమాణాలతో దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు శాపంగా మారింది. ఎంతో నిష్ట, క్రమశిక్షణతో కష్టపడి చదువుతున్న విద్యార్థులకు ఈ లికేజి వ్యవహారం నష్టం జరిగిందని, దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారని, NDA గత పదేళ్ళ పాలనలో NTA ఆద్వర్యంలో జరిగిన పరిక్షలలో చాలా సార్లు లికేజిలు జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోకపోవడం వలన NTA అసమర్థత మరింత ఎక్కువైందని అబ్దుల్ రజాక్ ఎద్దేవా చేశారు.

నిబంధనల పేరిట నీట్ అభ్యర్థులను వేధించడంలో ఉన్న శ్రద్ధ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో NTA చూపించలేక పోవడం దుర్మార్గమని అన్నారు. తాత్కాలిక ఉపశమనం కొరకు లికేజి వ్యవహారంలో కేంద్రం CBI ఎంక్వైరీ వేయడమేనని, లీకేజి వల్ల విద్యార్థుల శ్రమ, సమయం, భవిష్యత్తు, జీవితాలు తీవ్రంగా నష్టపోతున్నాయనని, వెంటనే దీనికి భాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి, NTA ను పూర్తిగా ప్రక్షాళన చేసి, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పూర్తి జాగ్రత్తలు చేపట్టాలని షేక్ అబ్దుల్ రజాక్ డిమాండ్ చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.