Connect with us

Andhra

విద్యా విధానంలో శాస్త్రీయతతో కూడిన మార్పు తేవాలి.. యంపీజే

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ల ప్రారంభానికి మరో 15 రోజులే మిగిలిందని, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కూల్ కిట్లను సకాలంలో విద్యాశాఖ అందించాల్సిన అవసరం ఉందని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ కోరారు.

అలాగే పేదలకు కార్పోరేట్ విద్యను అందించే ఉద్దేశ్యంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశమైన విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని, గత నాలుగేళ్లుగా ప్రభుత్వాలు మారినా విద్యా హక్కు చట్టంపై నిర్లక్ష్యం చేస్తూ..శ్రద్ధ చూపక పోవడం పట్ల యంపీజే అసహనం వ్యక్తం చేస్తుందని అన్నారు.

దేశంలో, రాష్ట్రంలో ఉన్న ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో విద్యాభ్యాసం చేస్తూ మధ్యలో మానుకునే (డ్రాప్ ఔట్స్) వారి సంఖ్య (లక్షకు పైగా ఉన్నట్లు) గణనీయంగా పెరుగిందని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారని, దీని కన్నా ఎక్కువే ఉంటాయని, కావున డ్రాప్ ఔట్స్ ని తగ్గించే దిశగా ప్రభుత్వ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యా విధానంలో శాస్త్రీయత లోపించడంతో విద్యార్థులు డిగ్రీలతో సరిపెట్టుకొని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా పెరుగుతున్న పరిస్థితి నెలకొందని, రాష్ట్రంలోని పాడుబడిన స్కూల్ల స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టి, విద్యార్థులకు హాని జరగకుండా చూడాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ డిమాండ్ చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.