Connect with us

Business

బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి

Published

on

బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. వారం రోజుల క్రితం వరకు 97 వేల దగ్గర ట్రేడ్ అయిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర మళ్లీ లక్షకు చేరింది. బంగారం కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చింది. పేద, మధ్య తరగతి కుటుంబాలు బంగారం కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి తయారైంది. బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారు ప్రస్తుతం భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.

హైదరాబాద్ మహా నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,950 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,400 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,050 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,410 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,960 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 76,060 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

మే నెల మొదట్లో బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. మే నెల చివరికి వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. వెండి ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,000 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 12,010 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,20,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.