Andhra
పెహల్గామ్ దాడి భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసెందుకు చేసిన కుట్ర
లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రకాశం జిల్లా మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు, APCR ( అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్) రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాసరావులు పాల్గొని మాట్లాడుతూ..పెహల్గామ్ దాడి భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసెందుకు చేసిన కుట్ర అని, ముఖ్యమైన రెండు మతాల మధ్య విద్వేషాన్ని పెంచి, భారత్ లో మత సామరస్యం దెబ్బ తీసేలా చేయడమే ఉగ్రవాదుల లక్ష్యమని, అందులో భాగంగానే పెహల్గాం దాడి జరిగిందని తెలిపారు. ఆ తదనంతరం దేశ వ్యాప్తంగా 184 చోట్ల ముస్లింలపై దాడులు జరిగాయని, ఒక అమాయక ముస్లిం కూలిని చంపేశారని ఇది దుర్మార్గం అని అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ..దేశ మత సామరస్యాన్ని ఛిన్నాభిన్నం చేసెందుకు కొన్ని శక్తుల ప్రయత్నాలు చేయడం దురదృష్టకరం అని అన్నారు. దేశంలో మన ప్రజలపై మన ప్రభుత్వాలు దాష్టీకానికి పాల్పడుతున్నాయని ఇందుకు ఇప్పుడు ఎటువంటి శిక్షలు పడకుండానే జైలులో మగ్గుతున్న ఖైదీలే నిదర్శనం అని అన్నారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రజా నాయకులను భౌతికంగా లేకుండా చేయడమే ప్రభుత్వ పన్నాగంలా కాపాడుతుందని, ఇందుకు మన దేశంలో ఉన్న ఉద్యమ నాయకులైన మవోయిష్టులను భౌతికంగా చంపేయాలని ప్రయత్నం చేయడం రాజ్యంగం విరుద్ధం అని వారు తెలిపారు. చట్టాలు ధనవంతులకు, రాజకీయ నాయకులకు చుట్టంగా, సామాన్య ప్రజల మీద మాత్రమే ఆచరించేలా చేయడం దుర్మార్గం అని అన్నారు.ఈ కార్యక్రమానికి ప్రభాకర్ రావు అధ్యక్షత వహించగా, షేక్ ముహమ్మద్ రఫి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందే నాసరయ్య, షేక్ ఖాశిం, సిపిఎం నాయకులు డి సోమయ్య, డికెయం రఫి, రూబెన్, యంపిజే నాయకులు షేక్ అబ్దుల్ రజాక్, షేక్ ఖాసిం, నాగూర్ మీరావలి తదితరులు పాల్గొన్నారు.
![]()
