Connect with us

Entertainment

డబ్బులిచ్చి యూట్యూబ్ వ్యూస్ కొనొద్దని చెప్పాను

Published

on

నితిన్ నటించిన తమ్ముడు మూవీ ట్రైలర్ బుధవారం (జూన్ 11) లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ తమ్ముడు మూవీ టికెట్ల ధరలను పెంచబోమని, అంతేకాదు ఈ ట్రైలర్ కు వచ్చే వ్యూస్ పూర్తిగా ఒరిజినల్ అని అతడు చెప్పడం గమనార్హం.

డబ్బులిచ్చి వ్యూస్ వద్దన్నాను

ఏదైనా మూవీ ట్రైలర్ రిలీజ్ కాగానే.. యూట్యూబ్ లో రికార్డులంటూ చెప్పడం సాధారణమైపోయింది. అయితే అందులో చాలా వరకు పెయిడ్ వ్యూసే ఉంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఇక నుంచి తన సినిమాలకు మాత్రం అలాంటివి వద్దని తన పీఆర్ టీమ్ కు కచ్చితంగా చెప్పినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించాడు. తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అతడు ఈ కామెంట్స్ చేశాడు.ఈ సినిమా నుంచే దీనిని మొదలు పెడుతున్నామని చెప్పాడు. డబ్బులిచ్చి వ్యూస్ కొనడం వల్ల అసలు కంటెంట్ ప్రేక్షకులకు ఎంత వరకూ రీచ్ అవుతుందన్నది తెలియడం లేదని, ఒరిజినల్ వ్యూస్ వల్లే అది తెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు నంబర్ వన్ అని, దానిని మంచి కంటెంట్ తో అలా నిలబెట్టుకోవాల్సిన అవసరం నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు ఇలా అందరిపై ఉందని అతడు అన్నాడు.

హీరోల రెమ్యునరేషన్లపై..

తమ్ముడు సినిమాకు హీరో నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇంత వరకూ రెమ్యునరేషన్ తీసుకోలేదని, రిలీజ్ తర్వాతే తీసుకుంటారని చెప్పారని ఈ సందర్భంగా దిల్ రాజు వెల్లడించాడు. మరి హీరోల రెమ్యునరేషన్లను ప్రొడ్యూసర్లే వెంట పడి పెంచుతున్నారని, ఈ నేపథ్యంలో అందరు హీరోలను ఇలా అడిగే ధైర్యం నిర్మాతలకు ఉందా అని మీడియా ప్రశ్నించినప్పుడు.. దిల్ రాజుకు ఉంది అని అతడు అనడం గమనార్హం.

దిల్ రాజుకు ఎందుకు ఉందని అన్నానంటే.. నేను అందరు హీరోలతో పని చేశాను. వాళ్లకు దీని గురించి చెప్పినప్పుడు కొందరు స్టార్ హీరోలు కూడా మెచ్చుకున్నారు. బృందావనం మూవీకి ఎన్టీఆర్, మిస్టర్ పర్ఫెక్ట్ కు ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు మహేష్ బాబు, వకీల్ సాబ్ కు పవన్ కల్యాణ్ ఇలాగే చేశారు. హీరోలను కూర్చోబెట్టి మూవీ ఎకనమిక్స్ గురించి కూడా వాళ్లకు చెబితే అర్థం చేసుకుంటారు. ఆ ఓపిక నిర్మాతలకు ఉండటం లేదు” అని దిల్ రాజు అన్నాడు.

ఇక టికెట్ల ధరల పెంపు గురించి కూడా ఈ సందర్భంగా దిల్ రాజు స్పందించాడు. తమ్ముడు సినిమాకు ఎలాంటి పెంపు ఉండబోదని స్పష్టం చేశాడు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడానికి ఇలాంటి చర్యలతోపాటు క్యాంటీన్ ధరలు తగ్గించడం, మంచి సౌకర్యాలు కల్పించడం వంటివి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.