India
క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీం తీర్పు..
ఢిల్లీ: భారత రాజ్యాంగం కల్పించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్ల ప్రయోజనాలు కేవలం హిందువులు, సిక్కులు, బౌద్ధులకు మాత్రమే పరిమితమని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. మతం మార్చుకున్నా తమ పాత హోదాను కొనసాగించవచ్చని భావించేవారికి షాక్ ఇస్తూ సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారి, ఆ మత ఆచారాలను పాటించే వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ రిజర్వేషన్లు గానీ, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద రక్షణ గానీ లభించదని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
![]()
