Andhra
మార్కాపురం బిజేపి జిల్లా అద్యక్షులుగా పివి కృష్ణారావు..
మార్కాపురం: మార్కాపురం నూతన జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పివి కృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నుండి నేడు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈయన విద్యార్థి దశలో బిజెపి అనుబంధ సంఘమైన ఏబీవీపీ లో చురుకైన పాత్ర పోషిస్తూ.. అనంతరం బీజేవైఎం లోను, ఆ పార్టీ కార్మిక సంఘంలోను పని చేశారు. అలాగే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, మార్కాపురం నియోజకవర్గ పార్టీ ఇంచార్జిగా బాధ్యతలను నిర్వర్తించారు.
అయితే ఈ పదవి కోసం వైఎస్ఆర్ సీపీ నుంచి బిజేపి చేరిన డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి పోటీపడ్డారు. చివరికి పాత కాపు పివి కృష్ణారావుకే పదవి దక్కింది.
![]()
