Connect with us

Andhra

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి స్వామి

Published

on

మార్కాపురం: విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాలులో శుక్రవారం మార్కాపురం జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఉచిత మూడు చక్రాల స్కూటర్ ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కింద 17.5 కోట్లతో 1750 మందికి వీటిని అందజేస్తున్నట్లు వివరించారు.

మార్కాపురం జిల్లాలో మొదటి విడతగా మొత్తం 40 స్కూటర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 4.32 కోట్లతో దివ్యాంగుల హాస్టల్స్ ను రిపేర్ చేస్తున్నామన్నారు. విశాఖపట్నంలో 200 కోట్లతో ప్యారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు డిసబుల్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు త్వరలో దీనికి పూర్తి స్థాయి అధికారులను నియమిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 300 విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రతి జిల్లాలో ఒక దివ్యాంగ భవనాన్ని నిర్మిస్తామని వివరించారు.

అంతేకాకుండా ప్రతి జిల్లాలో ఆటిజం సెంటర్లు ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేక డాక్టర్లను నియమిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా విభిన్న ప్రతిభావంతులకు అందజేస్తున్న ఈ స్కూటర్లు వారి దైనందిక జీవితంలో మంచిగా ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా మీకు కృత్రిమ పరికరాలు సైతం అందజేయడం జరుగుతుందని మరింత విశ్వాసంతో మీరు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులకు సమాన అవకాశాలు పొందాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల – వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ జి. నారాయణస్వామి, మార్కాపురం గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం తెదేపా ఇన్చార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, డిఆర్ఓ వెంకట శివరామిరెడ్డి, ఆర్డీవో ప్రభాకర్, జనసేన ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్, భాజపా జిల్లా అధ్యక్షులు కృష్ణారావు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.