Connect with us

Andhra

MLA చే జాతీయ శాంతి సేవా పురస్కారం అందుకున్న టిడిపి యువ లీడర్ శివ۔۔

Published

on

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని శ్రీ సూర్య రెస్టారెంట్ ఫంక్షన్ హాల్ నందు శాంతియుతంగా కలిసి జీవించే అంతర్జాతీయ దినోత్సవం కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి కోట రాధ మేడిది వెంకటసుబ్బయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేడిది వెంకటేశ్వరరావులు సంయుక్తంగా నిర్వహించారు.

తెలుగు రెండు రాష్ట్రాల్లోని స్వచ్ఛంద సేవ చేస్తున్న సామాజిక కార్యకర్తలను ఎన్ టి ఆర్ జిల్లా తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ బొడ్డపాటి దాస్, మేడిది వెంకటేశ్వరరావ్, రంగా నాగేంద్రబాబు, ప్రిన్సిపాల్ మొహమ్మద్ ఖాజ బాబా، శ్రీమతి కోట రాధల చేతుల మీదుగా జాతీయ శాంతి సేవా పురస్కారం 2026 ను అందుకున్నారు.

ఈ సందర్భంగా మార్కాపురం యువ టిడిపి నాయకులు పిన్నిక శివ మాట్లాడుతూ.. సామాజికంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో గత 18 సంవత్సరాల నుండి ఆధ్యాత్మికంగా శాంతి సందేశం అందిస్తూ ఉన్నానని, ఇలాంటి ప్రసంగాలు చేస్తున్న కృషికి నాకు నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి శాంతి పురస్కారం అందించినందుకు ఆంధ్ర ప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కన్వీనర్ శ్రీమతి కోట రాధకి మేమెంటోలు అందించిన మేడిది వెంకటేశ్వరరావు లకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యువాచార్య పిన్నిక శివ కృతజ్ఞతలు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.