Connect with us

Andhra

10లో మంచి మార్కులు సాధించిన గుమ్మ యామినికి బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారం..

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన గుమ్మ యామిని తండ్రి నాగార్జునకు పదవ తరగతి ఫలితాల్లో 587 మార్కులు సాధించిన విషయం తెలిసుకున్న బిసి సంఘం ఆధ్వర్యంలో బిసి భవన్ లో శనివారం అభినందన సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పియల్పి యాదవ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు శాసనాల వీర బ్రహ్మం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనాల వీరబ్రహ్మం మాట్లాడుతూ.. చదువు పట్ల మమకారం ఉంటే, ఇలాంటి మార్కులు సాధించవచ్చని యామినిని కొనియాడారు. యామిని భవిష్యత్తులో మరింత ప్రతిభను కనపరచాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాళంరాజు రామకృష్ణ, కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్, గోసు సుబ్బారావు, బుర్రి వెంకటేశ్వర్లు, రంగస్వామి గౌడ్, గుమ్మ బాల నాగయ్య, షేక్ ఉస్మాన్, పిన్నిక శివ కుమార్, గుమ్మ గంగరాజు, గాలెయ్య, లక్ష్మీ నారాయణ, చెంచయ్య, కొండలు, యామిని తల్లిదండ్రులు గుమ్మ నాగార్జున, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.