Connect with us

Andhra

అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్‌లైట్ స్మారక దినోత్సవ ర్యాలీ..

Published

on

మార్కాపురం: ప్రతి సంవత్సరం మే నెల మూడవ ఆదివారం రోజున, HIV/AIDS కారణంగా మరణించిన వారిని స్మరించుకుంటూ వారి ఆత్మశాంతి కోసం అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్‌లైట్ స్మారక దినోత్సవం నిర్వహించడం అందరికీ తెలిసిందే.

ఈ సందర్భంగా ఈ సంవత్సరం కూడా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో, జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డా. కే. రాహుల్ గారి పర్యవేక్షణలో, 17వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు కంభం బస్టాండ్ సెంటర్ నుండి కోర్టు సెంటర్ సమీపంలోని UPHC వరకు కొవ్వొత్తుల ర్యాలీ మరియు మౌన ప్రదర్శన నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీమతి యం. విజయ సునీత ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లాను HIV రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. HIV ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని, అందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

ఈ సందర్భంగా డా. కే. రాహుల్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా HIV పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే, HIV నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ART మందులు అందిస్తున్నామని, వారి వ్యక్తిగత సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని చెప్పారు. HIV ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా మందులు వాడితే ఆయుష్షు పెరుగుతుందని, మరణాల సంఖ్య తగ్గించవచ్చని వివరించారు. HIV బాధితుల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదని ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమం చివరగా, కొవ్వొత్తులను రెడ్ రిబ్బన్ వద్ద ఉంచి, HIV కారణంగా మరణించిన వారిని స్మరించుకుంటూ 5 నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి శివరామిరెడ్డి, ఎస్.కే. అమీన్ (CPM), Dr. హర్ష వర్ధన్ రెడ్డి, Dr. సాయికిరణ్, జిల్లా సర్వేలన్స్ అధికారి Dr. M. యాగ్నిక్, తర్లుపాడు వైద్యాధికారి Dr. సోని, మార్కాపురం అర్బన్, గజ్జలకొండ, తిప్పయపాలెం, తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, anms, ఆషా కార్యకర్తలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, హాండ్స్ అఫ్ కంపెషన్, గ్రాండ్ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ICTC మరియు ART సెంటర్ల సిబ్బంది,మరియు నెట్‌వర్క్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.