Connect with us

World

న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణ స్వీకారం.. ఖురాన్ పై ప్రమాణం చేసిన మమ్దానీ

Published

on

న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మమ్దనీ గురువారం అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. మాన్హాట్టన్‌లోని సబ్వే స్టేషన్‌లో ఈ ప్రమాణ స్వీకార వేడుక ఘనంగా జరిగింది. డెమొక్రాట్ అయిన మమ్దానీ అమెరికాలోని అతిపెద్ద నగరమైన, విలాసవంతమైన న్యూయార్క్ సిటీకి మొదటి ముస్లిం మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం, ఖురాన్ పై చేయి ఉంచి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.

ఇది నిజంగా జీవిత కాలంలో లభించే ఒక అరుదైన గౌరవం, ప్రత్యేక సందర్భం అని మమ్దనీ తన ప్రసంగంలో చెప్పారు. ఈ వేడుకను ఆయన రాజకీయ మిత్రురాలు లెటిటియా జేమ్స్ నిర్వహించారు. మేయర్గా తన మొదటి వ్యాఖ్యలలో, మందనీ తన కొత్త రవాణా శాఖ కమిషనర్ మైక్ ఫ్లిన్ నియామకాన్ని నిర్ధారించారు. న్యూయార్క్ మేయర్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన 34 ఏండ్ల జోహ్రాన్ మమ్దనీ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.