World
సుడాన్ లో RSF అరాచకం.. ఐక్యరాజ్యసమితి నివేదిక
సుడాన్లో సైన్యం (SAF) మరియు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా, ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభం నెలకొందని ఐక్యరాజ్యసమితి (UN) నివేదికలు తెలిపాయి. సుమారు 4,00,000 మంది మరణించారని, 13 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారని, జాతి హింస, లైంగిక హింస, ఆకలి దాడులు మరియు ఆకలి తీవ్రంగా పెరిగాయని నివేదికలు తెలిపాయి. అలాగే గత సంవత్సరం అమెరికా, ఇజ్రాయెల్, యూఏఈ మద్దతు గల RSF మూడు రోజుల్లో (OCT 25th-27th) 6వేల మందికి పైగా చంపేశారని, వందలాది మంది లైంగిక హింసకు గురైనట్లు నివేదికను UN బయటపెట్టింది.
![]()
