Connect with us

Politics

తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు

Published

on

తెలంగాణలోని కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వాకిటి శ్రీహరి : పశుసంవర్థక, స్పోర్ట్‌ అండ్‌ యువజన సర్వీసులు శాఖ

గడ్డం వివేక్‌: కార్మిక, మైనింగ్‌ శాఖలు

అడ్లూరి లక్ష్మణ్‌ : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ

ఇటీవలనే తెలంగాణ కేబినెట్ ను విస్తరించిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే వారికి శాఖలు కేటాయించలేదు. మరోవైపు శాఖల కేటాయింపుతో పాటు విస్తరణ విషయంపై సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శాఖల కేటాయింపులపై సుదీర్ఘంగా పార్టీ పెద్దలతో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కీలక శాఖలు ఉండటంతో… వాటి నుంచే ఇస్తారనే చర్చ జరిగినప్పటికీ అలా కుదరలేదు. కీలకమైన హోంశాఖ, విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి.

ఇక కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన ఈ ముగ్గురు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే కావటం విశేషం. వివేక్ గతంలో ఎంపీగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక మక్తల్ నుంచి వాకిిటి శ్రీహరి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడింటితోనే సరిపెట్టిన అధినాయకత్వం…. త్వరలోనే మంత్రివర్గంలోని మరో మూడు ఖాళీలను కూడా భర్తీ చేయనుంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.