Connect with us

Andhra

కడప ఘర్షణ వెనుక ఉన్న శక్తులపై చర్యలు తీసుకోవాలి..MPJ

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో అల్మాస్ పేట సెంటర్ మార్పుపై జరిగిన సంఘటనను ముందస్తు అంచనా వేసి నియంత్రించడంలో జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలిపింది.

విజయవాడ లబ్బీపేటలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న మత సంఘర్షణల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. స్థానికంగా జరిగిన ఉద్రిక్తత నెలకొనెందుకు, అందుకు దారితీసిన పరిస్థితులను అంచనా వెయ్యడంలో కేంద్ర , రాష్ట్ర ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ విఫలమైందని, ఇందుకు కారణమైన అధికారులను బర్తరఫ్ చేయాలని రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసిందీ.

అలాగే ఈ సంఘటనపై హైకోర్టు జడ్జిచే జ్యుడీషియల్ స్వతంత్ర ఎంక్వైరీ చేయించాలని, రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని పెపోందించేందుకు చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో రాష్ట్రంలో ఎటువంటి మత ఘర్షణలైన కాకుండా నిఘా వ్యవస్థను బలోపేతం చెయ్యాలని, మృతి ఘర్షణలు నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని యంపీజే కార్యవర్గ సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో యంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా, లాల్కోట్ ముహమ్మద్ ఖదీర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాషా, కోశాధికారి షేక్ వలియా, పి జావిద్ ఖాన్, షేక్ యూసుఫ్, షేక్ సుభాని, మాజీ రాష్ట్ర కార్యదర్శి ముల్లా ముహమ్మద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.