India
రంజాన్ కు ఎందుకు అంత ప్రాముఖ్యం?
దివ్యఖుర్ఆన్ అవతరించిన నెల రమజాన్ నెల. ఇది ఎంతో శుభప్రద మయిన నెల. ఈ నెలలో, తన దాసుల ఆరాధనలకు ఎన్నో రెట్ల ప్రతిఫలం యిస్తానంటున్నాడు విశ్వప్రభువు. విశ్వాసులయిన దాసులందరిపై అల్లాహ్, ఈ మాసంలో ఉపవాసాలను విధిగా నిర్ణయించాడు. ఈ నెలలో ఫిత్రా దానాలు యివ్వాలని, తరావీహ్ నమాజ్ పాటించాలని ఆదేశించబడింది. వెయ్యి రాత్రుల కంటే శ్రేష్టమయిన ఒక రాత్రి లైలతుల్ ఖద్ర్ ఈ మాసంలోనే ఉంది. సృష్టికర్త సాన్నిధ్యాన్ని పొందడానికి, ఆయన ప్రసన్నతను చూరగొనడానికి ఉద్దేశించబడిన ‘ఏతెకాఫ్’ (మౌనవ్రతం) కూడా రమజాన్లోనే ఉంది. కనుక ఇది నిస్సందేహంగా అపారమయిన వరాలను పొందే నెల అని చెప్పవచ్చు.
![]()
