Connect with us

Andhra

మాఫియాగా మారిన మార్కాపురం జిల్లా.. DCC అధ్యక్షులు షేక్ సైదా

Published

on

మార్కాపురం: మార్కాపురం నూతన జిల్లా ఏర్పడి ఐదు మాసాలు పూర్తికావస్తున్న జిల్లాకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పన నేటి వరకు జరగలేదని, వివిధ శాఖల కార్యాలయాలు కూడా ఏర్పాటు కాలేదని, శాంతి భద్రతను కాపాడవలసిన ఎస్పీ పోస్ట్ సైతం ఇప్పటికీ పూర్తి చేయలేదని మార్కాపురం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రెవిన్యూ శాఖలో అనేక ఖాళీలు భర్తీ చేయవలసి ఉందని అలాగే విద్య, వైద్యం, పంచాయతీ రాజ్ శాఖలో కూడా ఇన్చార్జి పాలనల్లో నడుస్తున్నాయని” పేరుకే మార్కాపురం జిల్లా అని అంతా డొల్లని “నేడు మార్కాపూర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు షేక్ సైదా అన్నారు.

మార్కాపురం జిల్లా సాధన కోసం 65 రోజులు పాటు సుదీర్ఘంగా సాగిన ఉద్యమంతో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నాయకత్వంలో జరిగిన ఉద్యమ ఫలితంగా జిల్లాని సాధించుకున్నామని అయితే! జిల్లా సాధించుకున్నాం అనే ఆనందం ఇప్పుడు మార్కాపురం ప్రాంతంలో జరుగుతున్న భూకబ్జాలు, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా చూసి ఆనందం కాస్త ఆవిరి అయిపోతుందని షేక్ సైదా ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి సోమవారం జరిగే జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ మార్కాపురం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంగా ఉన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కాకుండా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేయమని కలెక్టర్ ని కలిసి కాంగ్రెస్ ప్రతి బృందం విన్నవించి మూడు వారాలు కావస్తున్న ఇప్పటికీ ఆ దిశగా ప్రయత్నించకపోవడం బాధాకరమని ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం అయితే వెంటనే ఆ విధంగా చర్యలు చేపట్టాలని, అధికారులు, జిల్లా కలెక్టర్లు ప్రజల, అర్జీదారుల ప్రయోజనం కలిగే విధంగా ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేయాలని సైదా డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ భూములు పేద ప్రజల ప్రవేట్ భూములు కబ్జాకు గురి కాకుండా, కొండలను పిండి చేసి గ్రావెల్ను తరలించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సైదా డిమాండ్ చేశారు.

అలాగే వెలిగొండ ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి నిధులు కేటాయించాలని, వట్టి మాటలతో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదని నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ప్రాజెక్టు పూర్తి కాదని నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వగలరని సైదా అన్నారు. జూన్ కి వెలుగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం అన్న చంద్రబాబు మాటమీద నిలబడాలని ఇంకా కేవలం నెల మాత్రమే ఉందని ఈ నెల కాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేది ఎప్పుడు అని సైదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్పి పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని సైదా తీవ్రంగా విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి ప్రాజెక్టు వెంటనే నిర్మాణం చేపట్టకపోతే ఏపీసీసీ చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డితో కలిసి మార్కాపురం కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సైదా అన్నారు.

ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ మహబూబ్ వలి, మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ రెహనాబాను, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులు సామ్యూల్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ షేక్ అల్తాఫ్ బాషా, సుభాని, తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.