Andhra
అతివేగంతో ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సును సీజ్ చేసిన రవాణా శాఖ..
మార్కాపురం: విజయవాడ రవాణాశాఖ కమిషనర్ వారి కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో భాగంగా, మే నెల 5వ తేదీన తేదీన బెంగళూరు నుండి మార్కాపురం వస్తున్న RVTP Ltd Travels కి సంబంధించిన NL07B0947 నంబర్ గల ప్రైవేట్ బస్సు నిర్ణీత వేగ పరిమితిని (80 kmph) మించి ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.
రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మే నెల 6వ తేదీన మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) బృందం సదరు వాహనాన్ని తనిఖీ చేసింది. అధికారుల పరిశీలనలో కూడా ఆ వాహనం 80 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటి నడుస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీనితో మోటార్ వాహనాల చట్టం (MV Act) మరియు కేంద్ర మోటార్ వాహనాల నిబంధనల (CMV Rules) ప్రకారం కేసు నమోదు చేసి, బస్సును సీజ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా MVI మాధవరావు మాట్లాడుతూ.. ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులన్నింటినీ VLTD (Vehicle Location Tracking Device) ద్వారా విజయవాడలోని కంట్రోల్ రూమ్ నుండి 24 గంటల పాటు నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని, బస్సుల వేగంపై రవాణా శాఖ ప్రత్యేక నిఘా ఉంచిందని, నిబంధనలు ఉల్లంఘించి అతివేగంగా నడిపే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
![]()
