Andhra
మే1 నుంచి 30 తేదీ వరకు మార్కాపురం పట్టణంలో జనగణన.. కమిషనర్
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పురపాలక సంఘం పరిధిలో జనగణనలో భాగంగా ఇళ్ల గణన (Phase-1) ప్రారంభమైనదని, ఈ సర్వే మే 1వ తేది నుంచి మే 31వ తేది వరకు ఈ సర్వే కార్యక్రమం నిర్వహించబడుతుందని మున్సిపల్ కమిషనర్ DVS నారాయణ రావు తెలిపారు.
ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో సర్వే చేపడుతున్నారని, ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేయనున్నారని అన్నారు. ఈ సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారని ఆయన తెలిపారు.
మార్కాపురం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తమ ఇంటి వద్దకు వచ్చే సర్వే సిబ్బందికి సరైన వివరాలు అందించి సహకరించాలని ఆయన కోరారు. అలాగే ఈ సర్వే ద్వారా సేకరించే సమాచారం ప్రభుత్వ పథకాలు, పట్టణ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో కీలకంగా ఉపయోగపడుతుందని మార్కాపురం మునిసిపల్ కమిషనర్ DVS నారాయణరావు తెలిపారు.
![]()
