Connect with us

Andhra

సీఐ అల్తాఫ్ హుస్సేన్ నేతృత్వంలో మార్కాపురంలో కార్డెన్ సెర్చ్..

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని కొండారెడ్డి కాలనీలో ఉమ్మడి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు తెల్లవారుజామున విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ విశ్వనాథ రెడ్డి, రూరల్ ఎస్ఐ వేమన మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ తనిఖీలలో భాగంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు. కాలనీలోని ఇళ్ల వద్ద, వీధుల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ప్రజల వివరాలు సేకరించారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని 18 టూవీలర్లను పోలీసులు గుర్తించారు. వాటిలో కొన్ని వాహనాలను స్టేషన్‌కు తరలించి, సంబంధిత యజమానులు పత్రాలు చూపించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు సీఐ అల్తాఫ్ హుస్సేన్ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇటువంటి తనిఖీలు తరచూ కొనసాగుతాయని సీఐ అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.