Andhra
ఏ1 గ్లోబల్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం.. మాజీ ఎమ్మెల్యే అన్నా
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పురపాలక సంఘం పరిధిలో పరిసర గ్రామీణ ప్రాంతాల్లో మీర్జా షంషేర్ అలీ బేగ్ గ్లోబల్ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని గిద్దలూరు మాజీ శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు అన్నారు.
వేసవి తాపం దృష్ట్యా గ్లోబల్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శుద్ధ జల చలివేంద్రం కేంద్రంను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వేసవిలో పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్య ప్రజల దాహార్తిని తీర్చడంలో ఈ కేంద్రం ఎంతో మేలు చేస్తాయన్నారు.
ట్రస్ట్ నిర్వాహకులు, వైఎస్సార్ సీపీ నాయకులు మీర్జా షంషీర్ అలీ బేగ్ చేపట్టిన సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
![]()
