Andhra
విద్యాసంస్థల బస్సుల బధ్రతలో రాజీ లేదు..DTO రాంబాబు స్పష్టం
మార్కాపురం: విద్యాసంస్థల బస్సుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి స్కూల్ బస్సు తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని జిల్లా రవాణా అధికారి (DTO) సి. రాంబాబు స్పష్టం చేశారు.
శనివారం మార్కాపురం DTO కార్యాలయంలో జిల్లాలోని విద్యాసంస్థల యాజమాన్యాలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు కీలక సూచనలు చేస్తూ..
ATS ఫిట్‌నెస్ తప్పనిసరి అని, రాబోయే అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే అన్ని పాఠశాల బస్సులు ATS (Automated Testing Station) సెంటర్ నందు తనిఖీలు చేయించుకుని, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాలని, బస్సుల్లో వేగ నియంత్రణ పరికరాలు ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అగ్నిమాపక పరికరాలు మరియు అత్యవసర ద్వారాలు పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని, అలాగే అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని, విద్యార్థుల భద్రత విషయంలో యాజమాన్యాలు పూర్తి బాధ్యత వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (MVIs) మాధవరావు, భాస్కరరావు మరియు వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
![]()
