Andhra
నూతన సీఐ, ఎస్ఐ లను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అల్తాఫ్ హుస్సేన్, మార్కాపురం పట్టణ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన విశ్వనాథ్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో శుక్రవారం మార్కాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో మార్కాపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, కాంగ్రెస్ నాయకులు షామీల్, షేక్ మహబూబ్ సుభానీ, షేక్ అల్తాఫ్ తదితరులు పాల్గొని నూతన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులకు అండగా ఉంటామని అన్నారు.
![]()
