Connect with us

Andhra

సేవతో సత్తా చాటిన పిన్నిక శివ యాదవ్… స్ఫూర్తి ప్రదాత అవార్డు 2026 ప్రధానం

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ మరియు పావని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక స్ఫూర్తి ప్రదాత సోషల్ సర్వీస్ అవార్డు 2026ను టిడిపి నాయకుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యువాచార్య పిన్నిక శివకు ఘనంగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీమతి పివిసి అంజనీ కుమారి (సీనియర్ సూపరింటెండెంట్, సీఎస్సీ కోర్టు, హైదరాబాద్, (తెలంగాణ), ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి.ఎస్. నారాయణరెడ్డి, ప్రముఖ సంఘ సేవకులు గొట్టెముక్కల చెన్నకేశవులు, బి.ఏ. రాజాస్వామి చేతుల మీదుగా శివ అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత పిన్నిక శివ మాట్లాడుతూ.. తాను స్వచ్ఛందంగా, ఆధ్యాత్మిక దృక్పథంతో సమాజ సేవలో పాల్గొంటున్నానని, తన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తనకు ఈ అవార్డు ప్రదానం చేసిన నిర్వాహకులు గొట్టెముక్కల చెన్నకేశవులు, రాజాస్వామి గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ అవార్డు విషయం తెలిసిన వెంటనే పిన్నిక శివకు స్నేహితులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, టిడిపి అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.