Andhra
బిజేపిలో సమన్యాయం లేదు.. రాష్ట్ర నాయకురాలు షబానా రాజీనామా..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ షబానా గత పది సంవత్సరాలుగా మైనార్టీ విభాగం బిజెపి పార్టీలో వివిధ పదవులలో కొనసాగుతూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ.. పార్టీ భాలోపేతాని ఇతోధికంగా కృషి చేశారు. అయితే లోకసభలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఏమి ఉండదనీ ప్రకటించడంతో విస్మయానికి గురై, బిజేపి సామాజిక న్యాయం లేదని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా తాను బిజెపి పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్థానిక ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశంలో ఆమె ప్రకటించారు. ఇప్పటివరకు పది సంవత్సరాల కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బిజెపి పెద్దలు అందించిన సహకారానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తూనే.. బిజేపి మైనారిటీల పట్ల చూపిస్తున్న వివక్షను వ్యతిరేకిస్తూ రాజినామా చేసినట్లు తెలిపారు.
![]()
