Connect with us

Andhra

కోర్టు మందలించడంతో తుమ్మల చెరువులో పారిశుద్ధ్యం పనులు..

Published

on

తర్లుపాడు: మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా మురుగు కాల్వలు, పారిశుద్ధ్యం చేయక.. చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ లక్షల్లో ఖర్చులు కాజేసి, పనులు చేయలేదని గ్రామానికి చెందిన స్ధానిక వ్యక్తి అధికారుల వెంట తిరిగి వేసారి మార్కాపురం కోర్టులో PLC వేయగా, కోర్టులో జడ్జి పంచాయతీ అధికారిని మందలించడంతో తుమ్మలచెరువు గ్రామంలో మురుగు కాలువల పూడికతీత పనులను చేపట్టారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మ పర్యవేక్షణలో గురువారం గ్రామంలోని పలు వీధుల్లో ఈ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. గత కొంతకాలంగా గ్రామంలోని పలు వీధుల్లో మురుగు కాలువలు చెత్తాచెదారం, మట్టితో పేరుకుపోయి మురుగునీరు నిలిచిపోయి.. దీనివల్ల దోమల వ్యాప్తి పెరిగి, అంటువ్యాధులు ప్రబలుతున్న పట్టించుకోని పంచాయతీ అధికారులు, సీనియర్ సివిల్ జడ్జి గారైన శ్రీ దేవెందర్ రెడ్డి గారు మందలించిన పిదప ఈరోజు పంచాయతీ కార్యదర్శి పద్మ ఆద్వర్యంలో పారిశుద్ధ్యం చేపట్టడం గమనార్హం.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వలి, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.