Connect with us

Andhra

అర్జీల పరిష్కారానికి సానుకూలంగా చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్

Published

on

మార్కాపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలను సానుకూలంగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.

మార్కాపురం లోని కలెక్టరేట్లో సోమవారం అధికారులతో కలిసి ఆమె అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడతూ.. అర్జీదారులకు రాతపూర్వకంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా వారి సమస్యలను పరిష్కరించి అర్జీదారునితో కలిసి దిగిన ఫోటోను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. అర్జీదారులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే వారు పదేపదే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వస్తున్నారని మండిపడ్డారు. ఇకనుంచైనా అధికారులు పద్ధతి మార్చుకొని ప్రవర్తించాలని తెలిపారు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 167 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవిన్యూ 81, ఇతర సమస్యలకు సంబంధించి 86 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, మార్కాపురం కనిగిరి ఆర్డీవోలు ప్రభాకర్, శివరామిరెడ్డి, మైనింగ్ శాఖ ఏడి రవి వర్మ, మైక్రో ఇరిగేషన్ పీడీ జెనెమ్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.