Andhra
గాంధీ పార్క్ ను శుభ్రం చేయండి..డాక్టర్ షేక్ మహబూబ్ వలి..
మార్కాపురం: జిల్లా కేంద్ర మైన మార్కాపురం పట్టణం నడి బొడ్డున ఉన్న గాంధీ మున్సిపల్ పార్క్ అపరిశుభ్రంగా ఉన్న మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ప్రశ్నించారు.
ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్క్ ను పరిశీలించారు. గాంధీ మున్సిపల్ పార్క్ లో చెత్తా చెదారాలతో మందు బాటిల్లు, డిస్పోజల్ గ్లాసులతో చాయ్ కప్పులులతో, పాతబట్టలు, జంతువుల మల విసర్జనలతో అపరిశుభ్రంగా ఉందన్నారు. మున్సిపల్ అధికారులు పార్క్ ను ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మన భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ అభియాన్ ప్రారంభిస్తే, మన గాంధీ పార్కు స్వచ్ఛభారత్ అభియాన్ లో లేదా అని అధికారులను ప్రశ్నించారు. అధికారులు మహాత్మా గాంధీ మున్సిపల్ పార్కు పరిశుభ్రతపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ జనరల్ సెక్రెటరీ షేక్ అబ్దుల్లా, మార్కాపురం నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాసిం వలి, కాంగ్రెస్ పార్టీ కేకేసి మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
![]()
