Connect with us

Andhra

వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. కలెక్టర్ విజయ సునీత

Published

on

మార్కాపురం: వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో తాగునీటి ఇబ్బందులు ఎక్కడెక్కడ తలెత్తే అవకాశం ఉందో.. వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సాగర్ నీటి దగ్గరలో ఉన్న గ్రామాలను నీటితో నింపాలని, చెడిపోయిన డీప్ బోర్ లను మరమ్మతులు చేయాలని, తాగునీటి సమస్యలు లేకుండా తక్షణమే స్పందించాలని అధికారులకు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ సురేష్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.