Connect with us

Andhra

జిగ్జీవన్ రామ్ ఆశయాలు భావివితరాలకు స్ఫూర్తి.. కలెక్టర్

Published

on

మార్కాపురం: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అనగారిని వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పనిచేసిన ధీరుడు బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తి భావితరాలుకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత కొనియాడారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ముందుగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, భాజపా రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి వై. రామచంద్రా రెడ్డి, ఆర్డీవో ప్రభాకర్ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంటరానితనానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసి జనచైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. సుదీర్ఘకాలం పార్లమెంటెరియన్ గా పనిచేసి చట్ట సభల్లో తన సత్తా చూపిన ఆయన ఆకరి క్షణం వరకు దళిత జాతి సముద్దరణ కోసమే తపించారన్నారు. నేటి తరం ప్రజలు ఆయన ఖ్యాతి, చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. అంబేద్కర్ తర్వాత అంతటి ఖ్యాతిని గడించిన ఘనత జగ్జీవన్ రామ్ కే దక్కుతుందన్నారు. మారుమూల గ్రామాల్లో నేటికి సైతం అంటరానితనం ఉందని ప్రతి ఒక్కరు దాన్ని విడనాడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవిత గాధలను చదివి చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ ప్రేరణతో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు రాజ్యాంగ రచనా కమిటీ సభ్యునిగా తన వంతు పాత్ర పోషించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ డ బ్ల్యు వో శివనాయక్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, జిల్లా మలేరియా అధికారి రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.