Connect with us

Andhra

ఎస్ఐఆర్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా చెయ్యాలి..KM అబ్దుల్ సుభాన్

Published

on

మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఎంటెన్సివ్ రివిజన్) ఓటర్ల సమగ్ర నివేదికపై అవగాహన కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు KM అబ్దుల్ సుభాన్ మరియు ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ విచ్చేశారు.

ఈ సందర్భంగా KM అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ అనేది ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని అయితే ప్రస్తుతం కులం, మతం, పార్టీల పరంగా విభజించబడిందా అనే విధంగా మారిపోయిందా.. అనేలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, ఈ ప్రక్రియలో మరణించిన, డబుల్ ఓటర్లను తొలగించి, కొత్తగా చేర్పులు జరుగుతాయని, కానీ ఇప్పుడు కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకొని ఎస్ఐఆర్ నిర్వహించడం జరుగుతుందని ఆరోపణలు రావడం దురదృష్టకరమని, కాబట్టి ప్రజలందరూ ఎస్ఐఆర్ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకుని సంబంధిత బిఎల్ఓ లకు మీ యొక్క గుర్తింపు కార్డులను ఇచ్చి ఓట్లను మ్యాపింగ్ చేసుకోవాలని, ఫారం 7తో ఓట్లను తొలగించే ప్రక్రియ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల ఒత్తిడి వలన దేశంలో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో 58 మంది బిఎల్వోలు ఆత్మహత్య చేసుకున్నారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఈ ప్రక్రియని నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అలాగే ఎస్ఐఆర్ యొక్క ప్రక్రియ గురించి చాలా విశదీకరంగా వివరించారు. అనంతరం ఎస్ఐఆర్ పై KM అబ్దుల్ సుభాన్ అనువదించిన చిరు పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో యంపీజే కార్యవర్గ సభ్యులు షేక్ సుభాని, జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావాలి, వెల్ఫేర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ రసూల్, పి వాహెద్ ఖాన్, ముత్తవల్లీలు మీర్జా సఫ్దర్ అలీ బేగ్, షేక్ ముహమ్మద్, షేక్ మాసూమ్, పల్నాటి రెహమాన్, హుస్సేన్ బాషా మరియు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.