Connect with us

Andhra

జలజీవన్ మిషన్ పనులను పరిశీలించిన కలెక్టర్..

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ వద్ద రూ.1290 కోట్లతో జరుగుతున్న జల జీవన్ మిషన్ పనులను బుధవారం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పరిశీలించారు.

జిల్లాలో తాగునీటి పరిష్కారం కోసం చేపట్టిన ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు చేస్తున్న విధానం, ఇంతవరకు పూర్తయిన పనులు, చేయాల్సిన వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆలస్యం చేయవద్దని అధికారులకు హుకుం జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఆర్ డబ్లూఎస్ ఈఈ సురేష్ బాబు, ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.