India
విమానం కూలిన దుర్ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం..
ముంబై: రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు విమానంలో ఉన్న మరో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముగ్గురు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అయితే డీజీఏనే అధికారికంగా ప్రకటించారు. ఈ హఠాత్పరిణామంతో మహారాష్ట్ర ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అజిత్ పవార్ ఒకసారి MP గా, 7సార్లు ఎమ్మెల్యే గా గెలిచి రెండు సార్లు డిప్యూటీ సీఎం గా పనిచేశారు.
![]()
