Andhra
వేసవిలో జాగ్రత్తలు పాటించాలి: డాక్టర్ షమ సుల్తానా
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని హోప్ విన్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమ సుల్తానా తెలిపారు. గర్భిణులు ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవరూప పదార్థాలు తీసుకోవాలని, లేత కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
![]()
