Connect with us

India

లాయర్గా మారిన సీఎం మమతా బెనర్జీ.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి!

Published

on

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయవాదిగా మారారు. ఒక ముఖ్యమంత్రి నల్లకోటు వేసుకొని లాయర్గా మారి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఘనతను సాధించారు మమతా బెనర్జీ.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ను మమతా బెనర్జీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఆమె యుద్ధమే ప్రకటించారు. తాను వ్యతిరేకించే విషయాల్లో ఆమె చాలా అగ్రెసివ్, ఫైర్ బ్రాండ్‌గా వ్యవహరిస్తారు.

ఎస్ఐఆర్ పేరుతో బెంగాల్లో 58 లక్షల మంది ఓటర్లను తొలగించారని ఆరోపిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ కేసులో బుధవారం స్వయంగా ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లి తన వాదనలు వినిపించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఛాంబర్‌కు వెళ్లిన దీదీ.. తన వాదనలు వినిపించడానికి ఐదు నిమిషాల సమయం. దీనికి సీజేఐ అంగీకరిస్తూ.. 15 నిమిషాలు తీసుకోమని చెప్పారు.

మూసిన తలుపుల వెనుక న్యాయం ఏడుస్తోందని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సార్.. సమస్య ఏమైనా…… చివరికి మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదు. నేను ఈసీఐకి ఆరుసార్లు లేఖలు రాశాను.. అయినా ఇప్పటికీ ఎలాంటి సమాధానం రావడం లేదు. న్యాయం మూసిన తలుపుల వెనుక రోదిస్తోంది’ అంటూ ముఖ్యమంత్రి తన వాదనలను ప్రారంభించారు.

ఆమె ఎన్నికల కమిషన్‌పై పూర్తి స్థాయిలో దాడి చేశారు. తనను తాను ఒక “బాండెడ్ లేబర్” (వెట్టి చాకిరీ చేసే వ్యక్తి)గా అభివర్ణించారు. తాను కేవలం తన రాజకీయ పార్టీ కోసం మాత్రమే కాకుండా, ప్రజలందరి ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని చెప్పారు. ఎస్‌ఐఆర్‌తో ఓటరు జాబితా లక్షలాది మంది పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నట్లు, బతికున్న వారిని కూడా చనిపోయినట్లుగా ప్రకటించారని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.