Connect with us

Andhra

భారతీయ కిసాన్ యూనియన్ అమర్ టికేత్ జిల్లాల అధ్యక్షుల నియామకం – డాక్టర్ షేక్ మహబూబ్ వలి..

Published

on

మార్కాపురం: భారతీయ కిసాన్ యూనియన్ అమర్ టికేత్ మార్కాపురం మరియు ప్రకాశం జిల్లాల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసిన డాక్టర్ షేక్ మహబూబ్ వలి..

భారతీయ కిసాన్ యూనియన్ అమర్ టికేత్ జాతీయ అధ్యక్షులు మరియు ఉత్తరప్రదేశ్ మాజీ క్యాబినెట్ మంత్రి చౌదరి ఫిదా హుస్సేన్ ఆదేశాల మేరకు ఈరోజు మార్కాపురం జిల్లాకు డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రకాశం జిల్లా కి షేక్ సుభానికి భారతి కిసాన్ యూనియన్ అమర్ టికేత్ అధ్యక్షులకు నియామక పత్రాలు అందించిన భారతీయ కిసాన్ యూనియన్ అమర్ టికెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మహబూబ్ వలి వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు సమస్యల కోసం వారి సమస్యలను పరిష్కారానికి పాటుపడడానికి సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఇందులో అవకాశం ఉందని, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగిలిన 26 జిల్లాల జిల్లా అధ్యక్షులకు మరియు పట్టణ, నగర, మరియు గ్రామ అధ్యక్షులుగా నియమించనున్నందున స్వచ్ఛందంగా ఎవరైనా భారతీయ కిసాన్ యూనియన్ అమర్ టికేత్ సంస్థలో చేరి రైతులకు సమస్యల కోసం కృషి చేసే వాళ్లకు మంచి అవకాశం ఉందని పేర్కొన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతంలో నైన రైతులకు సంబంధించి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే రైతు సమస్యల మీద పోరాటం చేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.