Andhra
సీతానాగులవారం గ్రామంలో ఉన్న ముస్లిం స్మశాన వాటికను యధావిధిగా కొనసాగించాలి.. డాక్టర్ షేక్ మహబూబ్ వలి
మార్కాపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేడు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతకి తర్లుపాడు మండలం సీతనాగులవరం గ్రామంలో ఉన్న ముస్లిం స్మశాన వాటిక స్థలాన్ని యధావిధిగా కొనసాగించాలని మరియు స్మశాన వాటికకు ప్రహరి గోడ నిర్మించాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరం పంచాయితీ తీర్మానం ద్వారా 22/3 సర్వే నెంబరులో ఉన్న 13 సెంట్లు భూమిని ముస్లిం స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించారు. ఆ స్మశాన వాటికలో ముస్లింలను సమాధి చేసి కూడా ఉన్నారు.
అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ ముస్లిం స్మశాన వాటిక స్థలాన్ని వేరే ప్రభుత్వ సంస్థలకు లేదా వేరే వాటికి ఉపయోగించుకోవాలని గత రెండు రోజుల క్రితం స్మశాన వాటిక స్థలాన్ని శుభ్రపరిచారు. ఈ విషయాన్ని తెలిసిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామానికి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించి ఆ గ్రామస్తులకు అడిగి తెలుసుకోగా వారు కూడా అది ముస్లిం స్మశాన వాటిక స్థలంగా పేర్కొనడం జరిగింది.
అందువలన మార్కాపురం జిల్లా కలెక్టర్ కి ముస్లింల స్మశాన వాటికను యధావిధిగా కొనసాగించే విధంగా తమరు చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే రానున్న రోజుల్లో సీతా నాగులవరం ఆ గ్రామం కూడా మార్కాపురం మున్సిపాలిటీలో కలువనున్న సందర్భంగా ముస్లింల ప్రజలు ఆ ప్రాంతాలలో కూడా ఉంటారు కాబట్టి ఆ స్థలాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఆ స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలని ఓ కథనం కూడా ఉంది కానీ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి స్థలాన్ని కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
