Connect with us

Andhra

ప్రముఖులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన జమాతే ఇస్లామీ నంద్యాల శాఖ

Published

on

ప్రతి తెలుగు నూతన సంవత్సరం ఉగాదిని ఆహ్వానిస్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులను కలిసి జమాఆతె ఇస్లామీ హింద్ శుభాకాంక్షలు తెలుపటం ఆనవాయితి. ఈ నేపథ్యంలో నంద్యాల జేఐహెచ్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో “శ్రీ పరాభవ” నామ సంవత్సర ఉగాది గ్రీటింగ్ కార్డ్స్ ను నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా సమద్ దేశవిదేశాలలో, తెలుగు రాష్ట్రాలలో మరి ముఖ్యంగా నంద్యాల వాసులకు ” శ్రీ పరాభవ” నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాలం అమూల్యమైన ధనం, జీవితం అంతకన్నా విలువైన వనం అని నందన వనం లాంటి ఈ దేశాన్ని ప్రేమిస్తూ, కాపాడుకుంటూ ” శ్రీ పరాభవ” నామ సంవత్సరాన్ని శుభ సంకల్పంతో ఆహ్వానిస్తున్నామన్నారు. అనంతరం నంద్యాల తహశీల్దార్ శ్రీనీవాసులు గారిని, మాజి ఎంఎల్ శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శ్రీ తాతిరెడ్డి తులసీ రెడ్డి, ఏపి మార్క్ ఫెడ్ డైరెక్టర్,ప్రముఖ వైశ్య నాయకులు కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సుబ్బ గురుమూర్తి, శ్రీ చింతల మోహన్ రావు, రాష్ట్ర కాంగ్రేస్ కార్యదర్శి; ప్రముఖ న్యాయవాది శ్రీ రావినూతల దుర్గా ప్రసాద్, తాలుకా పోలీస్ స్టేషన్ ఎస్సై గారిని తదితర పుర ప్రముఖులను, మీడియా సోదరులను, వ్యాపారస్తులను కలిసి గ్రీటింగ్ కార్డులు, గీటురాయి పత్రికా ఇస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖులు స్పందిస్తూ ఇది మంచి సాంప్రదాయమని, హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే జమాతె ఇస్లామి సేవలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హాఫీజ్ షోయబ్ జమా, వరంగల్ సలీం, ముహమ్మద్ షఫీ, ముహమ్మద్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా రెండు మూడు రోజులు ప్రజలకు వ్యక్తిగతంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతాయి సమద్ తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.