Andhra
లామ్ నవమి ఆధ్వర్యంలో మంత్రి సంధ్యారాణి జన్మదిన వేడుకలు
స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జన్మ దినాన్ని పురస్కరించుకొని 23వ డివిజన్ రఘురాం నగర్ లో అంగన్వాడీ డ్వాక్రా సాధికార గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాంనవమి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముందుకు సాగుతున్నారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆమె అన్నారు. మంత్రి సంధ్యారాణి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
![]()
