Connect with us

Andhra

నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్ ను తరలించడాన్ని అరికట్టండి – యంపీజే..

Published

on

మిడిల్ ఈస్ట్ లో యుద్దాన్ని ఆసరాగా చేసుకుని కొందరు స్వార్ధ, అవకాశవాద వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసర వస్తువులను బ్లాక్ చేయడం దుర్మార్గమని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు.

మున్ముందు వచ్చే కరువును దృష్టిలో ఉంచుకుని గ్యాస్, ఇంధనం తదితర నిత్యావసర వస్తువులను బ్లాక్ చేసి అండర్ గ్రౌండ్ కు వ్యాపారస్తులు తరలిస్తున్నారని, ప్రభుత్వం అడపాదడపా దాడులు చేస్తున్నారే కానీ పూర్తి స్థాయిలో దాడులు చేయడం లేదని, కొంతమంది అధికారులు బ్లాక్ మార్కెట్ కు సహాకరిస్తూ.. ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని అన్నారు.

అలాగే ఇప్పటికే ఇండ్ల గ్యాస్ సిలిండర్లరు డీలర్లు బ్లాక్ మార్కెట్లో 3000 రూపాయల ప్రకారం బ్లాక్ లో అమ్ముతున్నారని తెలియవస్తుందని, కమర్షియల్ గ్యాస్ అయితే ఆకాశాన్ని ఎత్తున పెంచారని, దీంతో వ్యాపారస్తులు తప్పనిసరి పరిస్థితుల్లో రేట్లు పెంచేశారని, మిడిల్ ఈస్ట్ లో యుద్దం ముదిరి మరిన్ని రోజులు యుద్ధం జరిగితే నిత్యావసర ధరలను ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేని పేదలు, మధ్య తరగతి ప్రజలు నానా బాధలు పడవలసి వస్తుందని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వ్యాపారస్తులను, డీలర్లపై దాడి చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.