Connect with us

Andhra

22A భూ సమస్యల పరిస్కారానికి ప్రత్యేక చొరవ చూపాలి… డిఆర్ఓ ఓబులేసు

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లాలోని 22A భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని డిఆర్ఓ ఓబులేసు తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సమస్యపై వచ్చే అర్జీలను పాత పద్ధతిన తహసీల్దార్ నుంచి ఆర్డీవోకు…. ఆర్డీవో నుంచి కలెక్టర్ కు పంపిస్తే దీనిపై కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటారన్నారు. దీనిపై ఇంకా స్పష్టమైన జీవో రానందున సమస్యలు పరిష్కారం కావడం లేదని వివరించారు. ఈ 22A భూ సమస్యలపై జిల్లాలో 476 ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు చేసిన వాళ్లను పిలిపించి క్షుణ్ణంగా వాటిని పరిశీలించి తగిన రిపోర్ట్ పంపించాలని అధికారులను ఆదేశించారు. కారణం లేకుండా 22A లో చేర్చిన భూములపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భూ సమస్యలను జాగ్రత్తగా పరిష్కారం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మిగతా సమస్యలపై కూడా చొర చూపాలని కోరారు. చిన్న చిన్న సమస్యలపై కార్యాలయాలకు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చేవారిని ఎక్కువసార్లు తిప్పించుకోకుండా త్వరితగతిన పరిష్కారం చేయాలని వివరించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రెవిన్యూ సమస్యలపై 86, మిగతా ఇతర సమస్యలపై 51 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీవో పి. ప్రభాకర్, కనిగిరి ఆర్డీవో శివరామిరెడ్డి, డిఎంహెచ్ వో వాణిశ్రీ, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నెమ్మ, జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.