Connect with us

Andhra

నైట్ వాచ్మెన్ మరియు హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు చేపట్టాలి.. డాక్టర్ మహబూబ్ వలీ

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నైట్ వాచ్మెన్లు గత కొన్ని నెలల నుంచి విధులకు గైర్హాజరవుతున్నారని తెలుసుకున్న డాక్టర్ మహబూబ్ వలీ స్థానిక తుమ్మల చెరువు ప్రధానోపాధ్యాయుడిని ఈ విషయం గురించి అడగ్గా సరైన సమాధానం చెప్పకుండా అర్థం పర్థం లేకుండా పొంతన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ హైస్కూల్ కాంప్లెక్స్ సంబంధించి దాదాపు 30 లక్షల ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి, హైస్కూల్లో విలువైన విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన రికార్డులు, అలాగే నిత్యం బయటి వ్యక్తులు హైస్కూల్ కాంప్లెక్స్ లో ఉంటున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటానికి నియమించిన నైట్ వాచ్మెన్లు పూర్తి నిర్లక్ష్యంతో విధులు చెయ్యకుండా ప్రధానోపాధ్యాయుడితో కుమ్మక్కైఅయ్యారని ఈ రోజు జిల్లా సమస్యల పరిష్కార వేదికకు డాక్టర్ మహబూబ్ వలీ ఫిర్యాదు చేశారు.

విధులకు గైర్హాజరౌతున్న నైట్ వాచ్మెన్లకు, వీరితో కుమ్మక్కైన ప్రధానోపాధ్యాయుడిని విచారణ చేసి చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి జిల్లా ఇంఛార్జి కలెక్టర్ మరియు మండల, డివిజన్, జిల్లా విద్యాశాఖ అధికారులను ఫిర్యాదు రూపంలో కోరారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.