Connect with us

Andhra

మహిళా దినోత్సవం సందర్భంగా లాం నవమికి పురస్కారం

Published

on

ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీకి చెందినఅంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాం నవమి పార్టీ వర్గాల నుంచి తగిన గౌరవం పొందనున్నారు. గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ వర్గాల్లో ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు గృహిణిగా రాణిస్తూనే అన్ని రంగాల్లో కూడా తనదైన శైలిలో ముందుకు సాగారు. క్రీడారంగంపై తమకున్న మక్కువతో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని 59 గోల్డ్ మెడల్స్, 12 సిల్వర్ మెడల్స్, 8 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మీడియా రంగంలో కూడా రాణించి ఒక పత్రిక స్థాపించి ఆ పత్రికకు చైర్మన్ గా కొనసాగారు రాజకీయాల్లో ఆమె భర్తను ఆదర్శంగా తీసుకొని భర్త ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవ చేయాలి ప్రజలకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ బూత్ ఇంచార్జ్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ఏడు నియోజకవర్గాల్లో గొప్పగా పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి తమ వంతు పాత్ర వహించడమే కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి వాటిని నాయకులు అధినాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రజలకు ఆమె అందించిన సేవలకు గాను ప్రజలు హర్షం వ్యక్తపరచడమే కాకుండా లాం నవమి రాష్ట్రస్థాయి నాయకురాలిగా ప్రజాసేవ అందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. గతంలో మై టిడిపి యాప్, ఐ టీడీపీఎఫ్ లో చురుకుగా పనిచేసినందుకు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి చేతుల మీదుగా ఉత్తమ కార్యకర్త గా ప్రశంస పత్రాలు అందుకున్నారు ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లాం నవమి అన్ని రంగాల్లో కనబరిచిన ప్రతిభకు గాను, తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె పార్టీకి మరియు ప్రజలకు అందించిన సేవలకు పార్టీ నేతల నుంచి అరుదైన గౌరవాన్ని పొందబోతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.