Andhra
ఏపి మున్సిపల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన కమిషనర్ నారాయణ రావు..
మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యొక్క డైరీ కమ్ హ్యాండ్ బుక్ ను మార్కాపురం పురపాలక సంఘ కమీషనర్ DVS నారాయణరావు ఆవిష్కరించారు.
ఈసందర్భంగా మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నో ఏళ్లుగా మున్సిపల్ ఉద్యోగులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ యూనియన్ ప్రతి ఒక్క మున్సిపల్ ఉద్యోగికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక యూనియన్ గా మేమున్నాం అంటూ.. హామీని కల్పించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. కృష్ణ మోహన రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు మార్కాపురం మునిసిపల్ మేనేజర్ ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మరియు మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీ షేక్ టపా ఖాదర్ వలి, మార్కాపురం పురపాలక సంఘ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూపాల్ రెడ్డి, రెవిన్యూ అధికారి షేక్ సోహిల్ అహ్మద్, GSW మేనేజర్ శేఖర్ బాబు, టౌన్ ప్లానింగ్ అధికారి కె శ్రీనివాసులు, శానిటరి ఇన్స్పెక్టర్ బి. చెన్నకేశవులు, సీనియర్ సహాయకులు శ్యామ్, విజయకుమార్, పద్మావతి, వంశీ, తల్లమ్ ప్రసాద్, తాడి సత్యనారాయణ, గుమ్మా ప్రసాద్, పి వెంకటయ్య, కిరణ్, చప్పిడి శ్రీనివాసులు, వినయ్, కార్యాలయ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
![]()
