Connect with us

Andhra

కాంగ్రెస్ చీఫ్ షర్మిలమ్మ రచ్చబండ కార్యక్రమం విజయవంతం..

Published

on

తర్లుపాడు: మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో ప్రజలతో కలిసి రచ్చబండ కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన్రేగా పధకాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భ్రష్టు పట్టించి గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసి, కొత్త మార్పులతో తెచ్చిన VB G – RAM G చట్ట ద్వారా జరిగే నష్టాల గురించి ప్రజలకు వివరించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు నడ్డి విరుస్తున్నారని, అర్హత కలిగిన పేదల జాబ్ కార్డులను తొలగించాయని దుయ్యబట్టారు. ఈ రచ్చబండ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఆశీర్వదించాలని కోరారు. అలాగే మన్రేగా పథకాన్ని కేంద్ర ప్రభుత్వాలు కొనసాగించాలని, కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని ప్రజలను కోరారు.

మార్కాపురం నూతన జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల హోదాతో రావడం ఇదే తొలిసారి. దీంతో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం మొదలైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, మైనారిటీ సెల్ చైర్మన్ డాక్టర్ మహబూబ్ వలీలు ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఊపందుకుందని, 2029 ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉంటుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ డాక్టర్ మహబూబ్ వలీ, తర్లుపాడు మండల అధ్యక్షుడు షేక్ హుస్సేన్, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.