Connect with us

Andhra

గ్లోబల్ ఏఐ సమ్మిట్ – 2026 లో ఆర్.వి.ఆర్ & జె.సి విద్యార్థినులకు అరుదైన అవకాశం

Published

on

ఢిల్లీలో ఫిబ్రవరి 16 నుండి 20 వరకు నిర్వహించబడనున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ లో పాల్గొనేందుకు తమ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ (CSBS) విభాగం తృతీయ సంవత్సరం విద్యార్థినులు పఠాన్. రాఫియా, ధూళిపాళ్ల నేహా లకు అధికారిక ఆమోద పత్రాలు అందుకోవడం అభినందనీయమని కళాశాల అధ్యక్షులు డా. రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీ జాగర్లమూడి మురళీమోహన్, డా.జగదీష్ కె. మద్దినేని హర్షం వ్యక్తం చేస్తూ, ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఆధునిక ఏఐ రంగంలోని తాజా అభివృద్ధులను తెలుసుకోవడంతో పాటు, జాతీయ-అంతర్జాతీయ నిపుణులతో మమేకమయ్యే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవడం కళాశాలకే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు వెళ్లనున్న విద్యార్థినులను గురువారం నాడు కళాశాల సిబ్బంది అభినందించారు. ఈ సమ్మిట్‌లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీతో పాటు పలు దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ ఐటీ రంగ దిగ్గజాలు బిల్ గేట్స్, బ్రాడ్ స్మిత్, సుందర్ పిచాయ్, టోనీ బ్లెయిర్, ముకేశ్ అంబానీ, అలెగ్జాండర్ వాంగ్, క్రిస్టియానో అమోన్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలపై చర్చలు, వర్క్‌షాప్‌లు, సైన్స్ ఎక్స్‌పో, ప్యానెల్ డిస్కషన్లు నిర్వహించబడనున్నాయి.

భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఏఐ రంగంలో తమ కళాశాల విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టడం గర్వకారణమని కళాశాల సెక్రటరీ&కరెస్పాండెంట్శ్రీ రాయపాటి గోపాల కృష్ణ, ట్రెజరర్ డా.కొండబోలు కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం సహా అన్ని విధాల సహకారం అందించేందుకు యాజమాన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కళాశాల ప్రిన్సిపాల్ డా.కొల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ అండ్ ఆర్&డి డైరెక్టర్ డా. కె.రవీంద్ర, కళాశాల డైరెక్టర్ ఫైనాన్స్ & అడ్మినిస్ట్రేషన్ డా. ఎన్.వి. శ్రీనివాస రావు, సి.ఎస్.డి విభాగాధిపతి డా.ఎమ్.వి.పి. చంద్రశేఖర రావు, కళాశాల సి.ఎస్.బి.ఎస్ విభాగాధిపతి డా.ఏ. శ్రీనగేష్, తదితరులు కలరు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.