Andhra
రేపు మార్కాపురం జిల్లాకు రానున్న కాంగ్రెస్ చీఫ్ షర్మిల..
తర్లుపాడు: APCC చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి రచ్చబండ కార్యక్రమం మార్కాపురం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం, తుమ్మలచెరువు గ్రామంలో జరగనుందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి షేక్ సైదా తెలిపారు. ఈ సందర్భంగా తర్లుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మనాయుడిని కలిసి రచ్చబండ ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ మహబూబ్ వలి, పోలీస్ సిబ్బంది.
ఈ సందర్భంగా షేక్ సైదా, షేక్ మహబూబ్ వలీ మాట్లాడుతూ.. వైసిపి, టిడిపి కూటమికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాలకు వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారనరి, అందుకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల సమస్యల్ని దూరం చేస్తుందని, కావున రేపు వైఎస్ షర్మిలా కార్యాక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
![]()
