Andhra
జరిమానా కట్టలేని నిరుపేద ఖైదీలను విడుదలకు యంపీజే కృషి..వలియా
రాజమండ్రి: ఈరోజు ఎంపీజే రాష్ట్ర నాయకుల సూచనల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు జైలర్ రాజ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి శిక్షాకాలము పూర్తిచేసుకుని స్వల్ప జరిమానా కట్టలేక జైలులోనే ఉండిపోయినా పేద ఖైదీలను ఎంపీజే తరపున సదరు సొమ్మును చెల్లించి విడిపించుటకు అవకాశం ఇవ్వమని కోరడం జరిగింది. అలాగే రంజాన్ నెలలో ముస్లిం ఖైదీలకు ఇఫ్తార్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వమని కోరగా జైళ్ల డీఐజీ పర్మిషన్ పొందాలని జైలర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర కోశాధికారి షేక్ వలియా, ఎంపీజే రాజోలు ప్రెసిడెంట్ జిలాని, రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్, షఫీ, చిన్నారి, పొట్టిలంక వలి తదితరులు పాల్గొన్నారు.
![]()
