Andhra
ఆరోగ్యం పై అవగాహన అవసరం: డాక్టర్ షమ సుల్తానా
గుంటూరు : నల్లపాడులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబి) 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐఓబి నందు హోప్ విన్ హాస్పిటల్స్, నివబోప హెల్త్ ఇన్సూరెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఉచిత మెగా వైద్య శిబిరం’ నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన సుమారు వంద మంది పేషెంట్లకు హోప్ విన్ హాస్పిటల్స్ చైర్మన్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమా సుల్తానా బిపి, షుగర్, హిమోగ్లోబిన్ లెవెల్స్ వంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం డాక్టర్ షమా సుల్తానా మాట్లాడుతూ నేటి ఆధునిక జీవన శైలిలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ప్రజలకు తమ ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సందర్భం ఏదైనా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఉద్దేశంతో హోప్ విన్ హాస్పిటల్స్ కార్పొరేట్ వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుకే తమ హాస్పిటల్ నందు చేయడం జరుగుతుందన్నారు. హోప్ విన్ హాస్పిటల్స్ అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని కోరారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో హోప్ విన్ హాస్పిటల్స్ డాక్టర్లు, సిబ్బంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ పద్మావతి, నివబోప మేనేజర్ డి. సంపత్, కె. వెంకటేశ్వర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
![]()
