Connect with us

Andhra

వైసీపీ నాయకులు బురద జల్లుడు రాజకీయాలు మానుకోవాలి- ఎమ్మెల్యే కందుల

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివృద్ధి చేస్తుంటే వైసిపి నాయకులు ఓర్వలేక బురద జల్లుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మార్కాపురం జిల్లా ఇవ్వడంతో వైసిపి నాయకులు భరించలేకపోతున్నారని దానితో ఏం చేయాలో వైసిపి నాయకులకు పాలుపోవడం లేదని, మార్కాపురం జిల్లా ఆసుపత్రి తాను సాధించాలని వైసీపీ పాలనలో ఐసీయూ మూలన పడేసి తాళాలు వేశారని, దానితో తాను తాళాలు పగలగొట్టి ఐసియుని తన సొంత నిధులతో బాగు చేయించి పనిచేస్తున్నానని అన్నారు.

అలాగే గత వైసిపి పాలనలో వచ్చిన థైరాయిడ్ మిషన్ ను పడేశారని అయితే దాన్ని ఇప్పుడు తిరిగి పనిచేయిస్తున్నానని, మార్కాపురం జిల్లాను అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని దానికి అందరి సహకారం కావాలని ఆయన కోరారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.